మూవీడెస్క్: సినిమా హిట్ టాక్ అందుకున్న వెంటనే పైరసీ బారిన పడుతుండడం నిర్మాతలకు పెద్ద సమస్యగా మారింది.
ఇటీవల విడుదలైన తండేల్ సహా నాలుగు సినిమాలు నూతన సంవత్సరంలోనే లీక్ అయ్యాయి.
పైరసీ ఇప్పుడు HD రూపంలో రావడం సినీ పరిశ్రమకు పెద్ద ప్రమాదసూచకం.
ఈ సమస్యపై నిర్మాత బన్నీ వాస్ సీరియస్ అయ్యారు.
గీతా గోవిందం కేసులోని దోషులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారని, భవిష్యత్తులో గీతా ఆర్ట్స్ సినిమాలను పైరసీ చేయాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పైరసీ లింకులు షేర్ చేసుకునే వాళ్లను కూడా వదలబోమని స్పష్టం చేశారు.
వాస్తవానికి పైరసీ వెనుక ఉన్నవాళ్లను గుర్తించడమే పెద్ద సవాల్.
టెలిగ్రామ్, వాట్సాప్, వెబ్‌సైట్లు వంటి అనేక మార్గాల్లో పైరసీ లింకులు వ్యాపిస్తున్నాయి. వీటిని మూసివేయకపోతే డౌన్లోడ్ చేసేవాళ్లను అడ్డుకోవడం కష్టమే.
ఈటీవీ యాప్ పైరసీని అరికట్టేందుకు కొన్ని చర్యలు తీసుకుని విజయం సాధించినప్పటికీ, సమస్య పూర్తిగా అంతమవ లేదు. ఇలాంటి చర్యలు నిరంతరం కొనసాగాలి.
పైరసీపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒకరిద్దరిని శిక్షించడం కాదు, మొత్తం వ్యవస్థను అరికట్టేలా అన్ని సినీ పరిశ్రమలు కలిసికట్టుగా పోరాడాలి.
లేకపోతే, భవిష్యత్తులో నష్టం వందల కోట్ల రూపాయలకు పెరిగే అవకాశం ఉంది.