టాలీవుడ్: 2012 సంవత్సరం లో హిందీ దబాంగ్ సినిమాకి రీమేక్ గా వచ్చి పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో రుజువు చేసిన సినిమా గబ్బర్ సింగ్. ఇపుడు అదే కాంబో మళ్ళీ రిపీట్ అవబోతోంది. కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్క్షన్ లో పవన్ కళ్యాణ్ 28 వ సినిమాగా ఒక సినిమా రాబోతోంది. ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసారు సినిమా టీం. ఈ పోస్టర్ ఇండియా గేట్ మరియు స్వాతంత్ర్య సమరయోధులు సర్ధార్ వల్లభాయ్ పటేల్ – సుభాష్ చంద్రబోస్ చిత్రాలు కనిపించేలా డిజైన్ చేయబడి ఉంది. ఓ బైక్ పై పెద్ద బాలశిక్ష పుస్తకంతో పాటు రోజా పువ్వు కనిపిస్తోంది. ‘బ్లాక్ బస్టర్ కాంబో మళ్ళీ వస్తోంది.. ఈసారి ఇది ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు’ అంటూ రిలీజ్ చేసిన ఈ కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తిని కలిగిస్తోంది.
దీనిని బట్టి చూస్తుంటే ఈ సారి ఒక్క ఎంటర్టైన్మెంట్ అనే కాకున్నా అంతర్లీనంగా స్ట్రాంగ్ మెసేజ్ ఓరియెంటెడ్ కథతో వస్తున్నట్టు అర్ధం అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని , రవి శంకర్ ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. బోస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా రామ్ – లక్ష్మణ్ లు ఫైట్స్ కంపోజ్ చేయనున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ సినిమాలు ప్రకటనలతో సోషల్ మీడియా అంతా మారు మోగి పోతుంది. అందులో భాగంగానే ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ కూడా ట్రెండ్ లో ఉంది. ‘గబ్బర్ సింగ్’ రిజల్ట్ మళ్లీ రిపీట్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.