శాండల్ వుడ్: కరోనా కారణంగా ఓటీటీ ల హవా పెరిగింది. ఎంత ఓటీటీలు పెరిగినా కూడా కరోనా తర్వాత థియేటర్లు మొదలవగానే జనాలు స్వాగతించారు. సినిమాల్ని థియేటర్లలో ఆస్వాదిస్తున్నారు. కానీ కొన్ని సినిమాలని మాత్రం కంటెంట్ లేకపోతే జనాలు అస్సలు అటు వైపు కూడా చూడడం లేదు. మొన్ననే తెలుగులో ‘గాలి సంపత్’ అనే సినిమా విడుదలైన వారం రోజులకే ఓటీటీ లలో ప్రత్యక్షం అయింది.
ఇపుడు మరో సినిమా కూడా వారం రోజుల్లోనే ఓటీటీల్లో రాబోతుంది. కానీ అదేదో చిన్న హీరో సినిమా అనుకుంటే పొరపాటే. మనకి పెద్దగా తెలియదు కానీ కన్నడలో ‘పునీత్ రాజ్ కుమార్‘ స్టార్ హీరో. అక్కడ పవర్ స్టార్ అని పిలవబడే ఈ స్టార్ హీరో నటించిన ‘యువ రత్న’ అనే సినిమా ఈ వారమే ఏప్రిల్ 1 న కన్నడ మరియు తెలుగు లో విడుదలైంది. తెలుగు లో అసలు ఈ సినిమాని పట్టించుకున్న వారే లేరు. కన్నడ లో కూడా యావరేజ్ కలెక్షన్స్ తో ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.
ఒక పాత కమెర్షియల్ సబ్జెక్టు ని పట్టుకొని కొత్త హంగులని పెట్టినంత మాత్రాన కంటెంట్ మారదు కదా అని నిర్మాతలు ఆలోచించి కొత్త రకమైన కథలని ప్రోత్సహిస్తే బాగుంటది. మంచి కంటెంట్ ఉంటేనే జనాలు సినిమాలని ప్లాప్ చేస్తున్న తరుణంలో పాన్ ఇండియా రేంజ్ సినిమాలని రూపొందించి మార్కెట్ పెంచుకుంటే తరుణంలో ఇలాంటి సినిమాలు చేస్తూ హీరోలు ఉన్న మార్కెట్ ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అంతే కాకుండా ఇలా వారం రోజుల్లోనే సినిమాలని ఓటీటీ ల్లో విడుదల చేయడం వలన కూడా థియేటర్లలో సినిమాలు చూడాలన్న ఆశ జనాలకి తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. తమ లాభాల కోసం నిర్మాతలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ దీని వల్ల చాలా మంది నష్టపోయే దాఖలాలు ఎక్కువ ఉన్నాయి.