నవీ ముంబై: ఐపీఎల్ 2022 రెండవ రోజు పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఘనమైన విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 205 పరుగులను నమోదు చేసిన్ ఐపీఎల్ 2022 లో తొలి 200 పరుగుల రికార్డును నెలకొల్పింది.
206 పరుగుల భారీ లక్ష్యంతో ఛేధనలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కేవలం 18.5 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని చేధించింది. పంజాబ్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ 43, బానుక రాజపక్స 43, మయాంక్ అగర్వాల్ 32 పరుగులతో రాణించగా, చివర్లో షారుక్ ఖాన్ 24 నాటౌట్, ఓడియన్ స్మిత్ 25 నాటౌట్ లాంచనాన్ని పూర్తి చేశారు.
కాగా ఆర్‌సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 2, ఆకాశ్ దీప్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు. ఈ మ్యచ్ లో ఆర్సీబీ ఏకంగా 39 అదనపు పరుగులు సమర్పించుకుని మ్యాచ్ ను చేజార్చుకుంది. నూతన కెప్టెన్ మాజీ కెప్టెన్ ఇద్దరూ మంచి స్కోరు చేసినప్పటికీ మ్యాచ్ ను నిలుపుకోలేకపోయారు.