టాలీవుడ్‌లో మాస్ కమర్షియల్ సినిమాలకు చిరునామాగా నిలిచిన పూరి జగన్నాథ్, తన కొత్త ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు సమాచారం. లైగర్, డబుల్ ఇస్మార్ట్ నిరాశపరిచిన తర్వాత, తెలుగు హీరోలతో సినిమా చేయాలనుకున్నా, ఏ ఒక్కరూ వెంటనే ఓకే చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో, పూరి తన ఫోకస్‌ను కోలీవుడ్ స్టార్స్ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, విజయ్ సేతుపతితో పూరి ఓ భారీ మాస్ ఎంటర్‌టైనర్ రూపొందించనున్నాడట. తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ మంచి క్రేజ్ కలిగిన విజయ్ సేతుపతి, కథా బలం ఉన్న సినిమాలను ఎంచుకునే నటుడు. ఇక పూరి జగన్నాథ్ స్టైల్ మాస్ యాక్షన్ చిత్రాలకు పేరుగాంచిన దర్శకుడు. ఈ కాంబినేషన్ అనూహ్యమైనదే అయినా, సెట్ అయితే అదిరిపోయే ప్రాజెక్ట్ కానుంది.
విజయ్ సేతుపతి మాస్ హీరో కాకపోయినా, సరికొత్త పాత్రలను సమర్థంగా పోషించగల నటుడు. అటు పూరి స్టైల్, ఇటు విజయ్ ఇంటెన్స్ యాక్టింగ్ కలిసి ఓ కొత్త టచ్ ఇస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా హాట్ టాపిక్‌గా మారింది.
లైగర్ తో పాన్ ఇండియా ట్రై చేసినా, ఫలితం అనుకున్నట్లుగా రాలేదు. కానీ, ఈసారి విజయ్ సేతుపతితో చేయబోయే సినిమా పూరికి గేమ్‌చేంజర్‌గా మారుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. కథ, ప్రొడక్షన్ వివరాలపై త్వరలో క్లారిటీ రావొచ్చని టాక్. ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే, టాలీవుడ్, కోలీవుడ్ సినీ అభిమానులకు మాస్ ట్రీట్ ఖాయమని అంటున్నారు. మరి, పూరి మాస్టర్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి.