fbpx
Friday, October 18, 2024
HomeMovie Newsపుష్ప-2: క్లైమాక్స్ లో భారీ ట్విస్ట్?

పుష్ప-2: క్లైమాక్స్ లో భారీ ట్విస్ట్?

PUSHPA-2-BIG-TWIST-IN-CLIMAX
PUSHPA-2-BIG-TWIST-IN-CLIMAX

మూవీడెస్క్: అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 పై అంచనాలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. పార్ట్ 1 బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, సీక్వెల్‌పై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

డిసెంబర్ 6న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి, షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.

దర్శకుడు సుకుమార్ రీసెంట్‌గా వెల్లడించినట్లుగా, మంచి అవుట్‌పుట్ కోసం కొన్ని సీన్స్ రీషూట్ చేయడం జరుగుతుందని తెలిపారు.

తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం మేకర్స్ క్లైమాక్స్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

గతంలో రెండు వేర్వేరు వెర్షన్లు షూట్ చేసినట్లు టాక్ ఉండగా, ఇప్పుడు మూడో వెర్షన్‌పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

క్లైమాక్స్ సీన్ అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్ మధ్య కీలకంగా సాగుతుందని, ఇది మూవీకి కీలక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా ఆ సీన్ లో ట్విస్ట్ విజిల్ వేసేలా ఉంటుందట. పార్ట్ 3 కి కూడా అదే మెయిన్ లీడ్ అని టాక్.

ఇక పుష్ప-2లో రష్మిక మందన్న, శ్రీవల్లి పాత్రలో మరింత ప్రాధాన్యత సంతరించుకోనుందని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా సీక్వెల్‌కు బిగ్ హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం భావిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ భారీగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్‌ను తెచ్చుకుంది.

పుష్ప-2 ఈ ఏడాది పెద్ద హిట్ కావడం ఖాయమని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular