fbpx
Thursday, December 12, 2024
HomeMovie Newsపుష్ప 2: బాలీవుడ్ బాద్ షా రికార్డు బ్రేక్

పుష్ప 2: బాలీవుడ్ బాద్ షా రికార్డు బ్రేక్

PUSHPA-2-BREAKS-SHAHRUKH-KHAN-RECORDS
PUSHPA-2-BREAKS-SHAHRUKH-KHAN-RECORDS

మూవీడెస్క్: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 బాక్సాఫీస్‌పై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

అన్ని భాషల్లో ఘన విజయాన్ని అందుకుంటున్న ఈ సినిమా, ప్రత్యేకంగా హిందీ మార్కెట్‌లో అద్భుతమైన రికార్డులను సాధిస్తోంది.

డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా, మొదటి 5 రోజుల్లోనే షారుఖ్ ఖాన్ జవాన్ జీవితకాల వసూళ్లను అధిగమించింది.

జవాన్ రూ.582.31 కోట్ల వసూళ్లను సాధించగా, పుష్ప-2 ఇప్పటివరకు రూ.593.1 కోట్లు వసూలు చేసింది.

భారతీయ సినిమాల్లో అత్యంత వేగంగా హిందీ వెర్షన్‌లో రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా ఇది నిలిచింది.

ఈ రికార్డును కేవలం 5 రోజుల్లో సాధించడం హిందీ మార్కెట్‌లో కూడా పుష్ప-2 ప్రభావాన్ని రుజువు చేస్తోంది.

2021లో విడుదలైన పుష్ప: ది రైజ్కి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం, సునీల్, అనసూయ, జగపతి బాబు వంటి ప్రముఖ తారాగణంతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఈ విజయం పుష్ప బ్రాండ్ విలువను మరింత పెంచింది.

అయితే సోమవారం కలెక్షన్లు కాస్త తగ్గినా, ఇప్పటి వరకు సాధించిన వసూళ్లు సినిమా హవాను స్పష్టంగా చూపిస్తున్నాయి.

తదుపరి రోజుల్లోనూ పుష్ప-2 పటిష్టంగా నిలబడతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular