మూవీడెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ఆస్ట్రేలియాలో సత్తా చాటుతోంది. కేవలం 18 రోజుల్లోనే ఈ చిత్రం 4.2 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ వసూలు చేసి, తెలుగు సినిమాల టాప్ లిస్టులో రెండో స్థానానికి చేరుకుంది.
‘బాహుబలి 2’ (A$4.5M) హయ్యెస్ట్ కలెక్షన్ రికార్డ్‌ను దాటేందుకు ఇది దగ్గరలో ఉంది.
పాన్ ఇండియా మూవీగా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోన్న పుష్ప 2, ఆస్ట్రేలియాలోనూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది.
టాప్ 10 జాబితాలో మూడో స్థానంలో ‘ఆర్ఆర్ఆర్’ (A$3.6M) ఉంది. నాలుగో స్థానంలో ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ (A$3.13M) నిలిచింది.
ఐదో స్థానంలో సలార్ (A$1.75M) ఉండగా, ‘సాహో’ (A$1.03M) ఆ తర్వాత ఉంది. ఆస్ట్రేలియాలో మన పాన్ ఇండియా సినిమాల డిమాండ్ స్పష్టంగా కనిపిస్తోంది.
‘పుష్ప 2’ వెనుక వరుస హిట్స్ రావడం, ఆస్ట్రేలియాలోని ఇండియన్ డయాస్పోరా సినిమా కోసం ఉత్సాహంగా ఎదురుచూడడం వంటి అంశాలు కలెక్షన్స్ పెంచడంలో కీలకంగా మారాయి.
నార్త్ అమెరికా, యూరప్‌తో పాటు ఆస్ట్రేలియాలో తెలుగు సినిమాల విజయ ప్రస్థానం కొనసాగుతుండడం గర్వకారణం.
వచ్చే ఏడాది పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ‘గేమ్ చేంజర్,’ ‘ఓజీ,’ ‘హరిహర వీరమల్లు’ వంటి చిత్రాలు ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
మరి పుష్ప 2 రికార్డులు బద్దలు కొట్టి, టాప్‌లో నిలుస్తుందా అనేది చూడాలి.