మూవీడెస్క్: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. విడుదలైన రెండో వారంలో కూడా ఈ సినిమా వసూళ్ల సునామీ కొనసాగుతూనే ఉంది.
శనివారం 100 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేయగా, ఆదివారం మరో 104 కోట్లు కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
సోమవారం కూడా స్ట్రాంగ్ ఆక్యుపెన్సీ నమోదు చేసినట్లు తెలుస్తోంది.
దీంతో 11వ రోజులోనే ‘పుష్ప 2’ 1300 కోట్ల మార్క్‌ను దాటేసి అద్భుతమైన ఫీట్ సాధించింది.
ముఖ్యంగా పుష్పరాజ్ క్యారెక్టర్‌లో అల్లు అర్జున్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది.
‘పుష్ప’ కంటే ఈ సినిమాలో ఆయన 10 రెట్లు నేచురల్ యాక్టింగ్ చేశారని ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ అంచనాలకు తగ్గట్టుగా, ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ మాత్రమే 600 కోట్ల మార్క్‌ను దాటేసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, ‘దంగల్’, ‘బాహుబలి 2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూడో ఇండియన్ సినిమాగా ‘పుష్ప 2’ నిలిచింది.
మరోవైపు, ‘కేజీఎఫ్ 2’ రికార్డులను కూడా ఈ సినిమా దాటేసి, పాన్ ఇండియా స్థాయిలో టాలీవుడ్ సత్తాను మరోసారి చాటింది.
రెండో వారంలో కూడా బలమైన వసూళ్లు అందుకోవడంతో ఈ సినిమా 1500 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది.