మూవీడెస్క్: పాన్ ఇండియా మూవీ పుష్ప-2: ది రూల్’ విడుదల తేదీపై ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చేసింది.
అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుందని ఇప్పటికే ప్రకటించిన మేకర్స్, తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
‘పుష్ప-2’ చిత్రాన్ని డిసెంబర్ 5న ఇండియాలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు.
అంతేకాకుండా, ఈ వేడుకల్ని ముందుగానే ప్రారంభిస్తూ అల్లు అర్జున్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘వేడుకలు ఒకరోజు ముందుగానే ప్రారంభమవుతాయి.
బాక్సాఫీస్ వద్ద బాణాసంచా ముందే పేల్చబడుతుంది. పుష్పరాజ్ పాలన ఒక రోజు ముందే మొదలు’’ అని పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో మేకర్స్ అభిమానులను ఉత్సాహపరిచారు.
ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ స్టైలిష్ లుక్‌లో, గన్ పట్టుకుని కనిపించడం అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా చేసింది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు సృష్టించాయి.
అంతేకాకుండా, ‘పుష్ప-2’ ఓవర్సీస్ రిలీజ్ డిసెంబర్ 4న ఉంటుందని సమాచారం.
దీంతో ఈ క్రిస్మస్ సీజన్‌కు ముందు సినిమా అభిమానులను థియేటర్లకు రప్పించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.