మూవీడెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన పుష్ప 2 : ది రూల్ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుని, థియేటర్లలో ఇంకా మంచి వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తోంది.
భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా, విడుదలకు ముందే రూ. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి అంచనాలు అమాంతం పెంచింది.
రిలీజ్ తర్వాత మొదటి వారం రోజుల్లోనే రూ. 1000 కోట్లను దాటేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.
51 రోజులకు గాను, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 1800 కోట్ల వసూళ్లు సాధించినట్లు టాక్.
ఇటీవల కొత్త సన్నివేశాలు యాడ్ చేయడంతో, రీలోడెడ్ వెర్షన్‌కు నార్త్ బెల్ట్ ఆడియెన్స్ మరింతగా కనెక్ట్ అయ్యారు.
అయితే, నిర్మాత నట్టి కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, పుష్ప 2 హిందీలో మాత్రమే హిట్ అయిందని, దక్షిణాది రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయిందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి ప్రాంతాల్లో లాభాలు తక్కువగా ఉన్నాయని ఆయన ఆరోపించారు.
పుష్ప 2లో అల్లు అర్జున్ యాక్టింగ్, రష్మిక మందన్న గ్లామర్, శ్రీలీల స్పెషల్ సాంగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఫహాద్ ఫాజిల్, జగపతిబాబు వంటి నటులు కీలక పాత్రలలో మెప్పించారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మరో మెరుగైన హైలైట్‌గా నిలిచింది.
మరి పుష్ప 2 లాభ నష్టాలపై ఇంకా ఎంత వివాదం రేపుతుందో చూడాలి.
Pushpa 2 not yet reach the target of 2000 Crores.