మూవీడెస్క్: పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన పుష్ప 2: ది రూల్ (Pushpa 2 Collection) ప్రతి చోటా సంచలన విజయాన్ని సాధిస్తోంది.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది.
కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా 3 కోట్ల మందికి పైగా ఫుట్‌ఫాల్స్‌ను సాధించి, భారతీయ సినిమా చరిత్రలో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది.
ఈ చిత్ర విజయంలో అల్లు అర్జున్ నటన, సుకుమార్ కథ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కీలక పాత్ర పోషించాయి.
మొదటి రోజే 70 లక్షల మందికి పైగా థియేటర్లకు తరలివచ్చారు. తరువాతి రోజుల్లో కూడా ఇదే స్థాయిలో ప్రేక్షకులు బడ్జెట్ సినిమాలకు సరికొత్త రికార్డును అందించారు.
ఆరు రోజుల్లో సాధించిన 3.05 కోట్ల ఫుట్‌ఫాల్స్ పుష్ప 2ను అత్యధికంగా వీక్షించబడిన సినిమాల జాబితాలో చేర్చింది.
బాహుబలి వంటి చిత్రాలు కలెక్షన్‌తో పాటు ఫుట్‌ఫాల్స్‌లో రికార్డులు నెలకొల్పినప్పటికీ, పుష్ప 2 వేగం ఇప్పటివరకు అద్భుతంగా కొనసాగుతోంది.
ఈ విజయం కలెక్షన్ల పరంగా కూడా ప్రభావం చూపుతోంది. అన్ని భాషల్లో ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తూ, హిందీ వెర్షన్‌లో 400 కోట్లకు దగ్గరగా రావడం మరో విశేషం.
5-5.5 కోట్ల ఫుట్‌ఫాల్స్ సాధించే లక్ష్యంతో పుష్ప 2 విజయ యాత్ర కొనసాగుతోంది.