fbpx
Thursday, September 19, 2024
HomeMovie Newsపుష్ప 2 విడుదల అనుకున్న సమయానికే..

పుష్ప 2 విడుదల అనుకున్న సమయానికే..

PUSHPA-2-RELEASES-IN-DECEMBER-WITHOUT-DELAY
PUSHPA-2-RELEASES-IN-DECEMBER-WITHOUT-DELAY

మూవీడెస్క్: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 సినిమాపై ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ ఏడాది ఆగస్టు 15 న విడుదల కావాల్సిన ఈ సినిమా, కొన్ని కారణాలతో డిసెంబర్ 6కి వాయిదా పడింది.

దర్శకుడు సుకుమార్, సినిమాపై ఎలాంటి కాంప్రమైజ్ చేయకుండా, ప్రతీ దృశ్యాన్ని అత్యుత్తమంగా రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఈ సినిమా డిసెంబర్ 6కి విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా పుట్టుకొస్తున్నాయి.

సుకుమార్ సాధారణంగా తన సినిమాలను పూర్తి చేయడంలో ఆలస్యం చేస్తారని టాక్ వినిపిస్తుండటంతో, పుష్ప 2 2025కి వాయిదా పడుతుందని గాసిప్స్ పుట్టుకొచ్చాయి.

ఈ ఊహాగానాలపై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ స్పష్టత ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, డిసెంబర్ 6 న పుష్ప 2ను ఖచ్చితంగా విడుదల చేస్తామని తెలిపారు.

అంతేకాకుండా, డిసెంబర్ 5న ప్రత్యేక ప్రీమియర్లు కూడా ఉంటాయని చెప్పారు. సెప్టెంబర్ 2 నాటికి మొదటి భాగం ఎడిటింగ్ పూర్తి చేస్తారని, అక్టోబర్ 6 లోపు రెండవ భాగం కూడా పూర్తవుతుందని వివరించారు.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని, ఇంకా రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయని నిర్మాత తెలిపారు.

ఈ రెండు పాటలలో ఒకటి అక్టోబర్‌లో, మరొకటి నవంబర్‌లో చిత్రీకరించి విడుదల చేస్తామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular