మూవీడెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2: ది రూల్ ఇప్పటికే విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది.
డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, ప్రీ సేల్ బుకింగ్స్‌లోనే రికార్డులను తిరగరాస్తోంది.
ముఖ్యంగా హిందీ వెర్షన్‌కు విపరీతమైన స్పందన వస్తుండటం హైలైట్‌గా నిలుస్తోంది.
హిందీ మార్కెట్‌లో పుష్ప 2 మొదటి 24 గంటల్లోనే లక్షకు పైగా టిక్కెట్లు అమ్ముడవ్వడం గమనార్హం.
బాలీవుడ్‌లో ఇప్పటివరకు ఈ స్థాయిలో ప్రీ సేల్ రిపోర్ట్ అందుకున్న సినిమాలు చాలా తక్కువ.
‘టైగర్ 3,’ ‘డంకీ,’ ‘యానిమల్’ లాంటి భారీ చిత్రాలను అధిగమిస్తూ, హిందీ బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 హవా కొనసాగుతోంది.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ సినిమా మొదటి రోజు ఆర్ఆర్ఆర్, బాహుబలి 2, కేజీఎఫ్ 2 వసూళ్లను కూడా దాటే అవకాశం ఉందని చెబుతున్నారు.
పుష్పరాజ్ క్యారెక్టర్‌తో అల్లు అర్జున్ అభిమానుల మనసులను మరింత దోచుకుంటున్నాడు.
మాస్ ఎలిమెంట్స్‌తో పాటు పాన్ ఇండియా స్థాయి టెక్నికల్ నైపుణ్యంతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించనుందని అంతా ఆశిస్తున్నారు.
పుష్ప 2 రిలీజ్ రోజు థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంటుందనడంలో సందేహమే లేదు.