మూవీడెస్క్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న దేశవ్యాప్త చిత్రం పుష్ప. వీరిద్దరి కాబినేషన్ లో ఇప్పటికే ఆర్య, ఆర్య 2 తెరకెక్కాయి, ఆ తర్వాత వస్తున్న ఈ కాంబోలో హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో చిత్రీకరిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చాలా వేగంగా జరుగుతోంది.
ఈ మూవీలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా నటిస్తోంది. ఇదిలా ఉండగా, తాజాగా ఈ మూవీ నుండి ఒక అదిరిపోయే అప్‌డేట్ న్యూస్ రిలీజ్ అయింది. ఇవాళ ఆ మూవీలో రష్మిక మందన్నా యొక్క ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది ఆ చిత్ర బృందం.
ఈ రోజు విడుదలైన ఈ ఫస్ట్ లుక్ లో, రష్మిక మందన్నా ఒక గ్రామీణ యువతి శ్రీవల్లి పాత్రలో మెరవనుంది. ఫస్ట్ లుక్ లో తను చెవులకు కమ్మలు పెట్టుకుంటూ ఆకట్టుకుంటోంది రష్మిక. పోస్టర్ లో తన లుక్ ని బట్టి చూస్తే పుష్పలో రష్మిక డీగ్లామర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
శ్రీవల్లి ప్రేమను చూసి పుష్పరాజ్ మనసు కరిగింది అంటూ ట్వీట్ చేసింది ఆ చిత్ర యూనిట్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తుండగా, మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.