టాలీవుడ్: ఆర్య సినిమాతో అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ ని చేసిన డైరెక్టర్ సుకుమార్. వీళ్లిద్దరు మరో సారి ఆర్య 2 కోసం పని చేసారు. ఇపుడు మూడో సారి పుష్ప సినిమాతో రానున్నారు. మొదట ఈ సినిమాని ఒకే పార్ట్ లాగా రూపొందించి విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ తర్వాత ఈ సినిమాని రెండు పార్ట్ లుగా రూపొందించనున్నట్టు రూమర్స్ వినిపించాయి. ఈ రోజు ఆ విషయం అధికారికంగా ధృవీకరించారు. అన్ని సినిమాలు మరో సారి రిలీజ్ డేట్ లు లాక్ చేస్తుండడం తో సంక్రాంతి సినిమాలు ఆల్రెడీ హౌస్ ఫుల్ అవడం తో అంతకు ముందు ఉన్న క్రేజీ స్లాట్ లో ఫస్ట్ రిలీజ్ డేట్ లాక్ చేసాడు అల్లు అర్జున్. పుష్ప సినిమా మొదటి భాగాన్ని క్రిస్మన్ సందర్భంగా విడుదల చేయనున్నట్టు ఈ రోజు ప్రకటించారు.
పుష్ప సినిమాకి సంబందించిన పోస్టర్, టీజర్స్ చాలా నాచురల్ గా ఉండి మంచి హైప్ ని తీసుకొచ్చాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా కనిపించనున్నాడు. ది రైస్ అఫ్ పుష్ప అని మొదటి భాగాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమా మొదటి పాట కూడా మరి కొద్దో రోజుల్లో విడుదల అవనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీ గా రష్మిక మందన్న నటిస్తుంది. సినిమాలో విలన్ గా మళయాళం స్టార్ నటుడు ఫాహద్ నటిస్తున్నాడు. హై బడ్జెట్ సినిమాలని లైన్ లో పెడుతూ ఇండస్ట్రీ లో టాప్ బ్యానర్ గా ఎదుగుతున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.