fbpx
Friday, April 4, 2025
HomeNationalపుతిన్ లిమోజీన్‌లో అగ్ని ప్రమాదం.. భద్రతపై సందేహాలు

పుతిన్ లిమోజీన్‌లో అగ్ని ప్రమాదం.. భద్రతపై సందేహాలు

putin-limo-fire-moscow-security-questions

ఇంటర్నెట్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉపయోగించే అరస్ లిమోజీన్ కారులో మాస్కోలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని కలకలం రేపుతోంది. మాస్కోలోని లుబ్యంకా ప్రాంతంలో జాతీయ భద్రతా కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. మంటలు ఇంజిన్ నుంచి ప్రారంభమై కారు మొత్తాన్ని దహనం చేశాయి.

ఈ ఘటన పుతిన్ భద్రతపై అనేక అనుమానాలకు తావిస్తోంది. పేలుడు జరిగిన వెంటనే సమీపంలో ని రెస్టారెంట్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి కారు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని రష్యన్ మీడియా తెలిపింది.

ఈ ఘటనకు కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. కానీ ఇది పుతిన్‌పై హత్యా యత్నమా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రెసిడెన్షియల్ ఎస్టేట్ డిపార్ట్‌మెంట్ ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టింది.

ఇటీవల పుతిన్ ఆరోగ్యం విషయంలో అనేక వార్తలు వెలుగుచూస్తుండగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యలు ఈ ఘటనకు మరింత స్పష్టత ఇవ్వనంటున్నాయి. యుద్ధ భవిష్యత్తుపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular