సౌత్‌కు షాక్.. PVR ట్యూస్‌డే ఆఫర్‌లో ట్విస్ట్!
ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ PVR-ఐనాక్స్, సినిమా ప్రేమికుల కోసం ‘బ్లాక్‌బస్టర్ ట్యూస్‌డే’ పేరిట సూపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రతి మంగళవారం అన్ని ఫార్మాట్స్‌లో (2D, 3D, IMAX, 4DX) సినిమా టికెట్లను కేవలం ₹99 లేదా ₹149 ధరకు అందించనున్నట్లు తెలియజేసింది.
అయితే ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ ఆఫర్ దక్షిణాది రాష్ట్రాలకు వర్తించదు. అంటే తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ డీల్ పని చేయదు. దీని వల్ల సౌత్ ఆడియన్స్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
“మేమూ సినిమా లవర్స్ మే.. మాకు ఈ ఆఫర్ ఎందుకు కాదు?” అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేకించి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖలో పీవీఆర్ బ్రాంచ్‌లు ఉండి కూడా ఆఫర్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ నిర్ణయం వెనుక వ్యాపార ప్రయోజనాలే ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నా, ప్రేక్షకులు మాత్రం దేశవ్యాప్తంగా సమానత్వం కోరుతున్నారు. టికెట్ రేట్లు ఎప్పుడో పెరిగిపోయిన నేపథ్యంలో, ఇలా సౌత్‌ను వదిలేయడం తగదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇప్పటికే సోషల్ మీడియాలో ఒత్తిడి పెరుగుతోంది. PVR సంస్థ స్పందించి సౌత్ రాష్ట్రాలకూ ఈ ట్యూస్‌డే ఆఫర్‌ను వర్తింపజేయాలని డిమాండ్ ఊపందుకుంది.