టాలీవుడ్: RX100 ద్వారా హీరో గా పరిచయం అయిన నటుడు కార్తికేయ. మొదటి సినిమా తోనే సూపర్ హిట్ సాధించాడు. తర్వాత హిట్ కొట్టడం లో వెనకపడ్డాడు. వరుస సినిమాలు చేస్తున్నా కూడా అనుకున్నంత హిట్స్ సాధించలేదు. హీరోగానే కాకుండా విలన్ గా కూడా నాని జెంటిల్ మాన్ లో నటించాడు. తమిళ్ లో అజిత్ నటిస్తున్న వాలిమై సినిమాలో కూడా విలన్ గా నటిస్తున్నాడు కార్తికేయ. ప్రస్తుతం కార్తికేయ హీరో గా ‘రాజా విక్రమార్క’ అనే ఒక సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో కార్తికేయ ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా నుండి ఇదివరకే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.
ఈ రోజు బక్రీద్ సందర్భంగా రాజా విక్రమార్క సినిమా నుండి ఒక పోస్టర్ విడుదల చేసి సినిమా టీం శుభాకాంక్షలు తెలిపింది. పోస్టర్ విడుదల చేస్తూ ‘ మీకు తెలిసిన మనిషి కానీ, మీకు తెలియని మిషన్’ అని చెప్తూ ఇంటెన్స్ లుక్ లో ఉన్న కార్తికేయ లుక్ ని విడుదల చేసారు. NIA ఏజెంట్ రోల్ లో మంచి యాక్షన్ సీన్స్ కూడా ఉండబోతున్నట్టు సినిమా టీమ్ హింట్స్ ఇచ్చారు. శ్రీ చరిత మూవీ మేకర్స్ బ్యానర్ పై రామ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని శ్రీ సారిపల్లి అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. సినిమా విడుదలకి సంబందించిన వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడించనున్నారు.