టాలీవుడ్: తమిళ్ లో విష్ణు విశాల్ హీరోగా రూపొంది సూపర్ హిట్ అయిన సినిమా ‘రాచసన్’. తెలుగు లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా ‘రాక్షసుడు’ అనే టైటిల్ తో 2019 లో విడుదలై సూపర్ హిట్ అయింది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సినిమాని తెలుగు లో ‘రమేష్ వర్మ‘ డైరెక్ట్ చేసారు. ప్రస్తుతం రవి తేజ తో ‘ఖిలాడీ’ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాని పూర్తి చేసి విడుదల కోసం ఎదురు చూస్తున్న ఈ డైరెక్టర్ ఈ గ్యాప్ లో రాక్షసుడు సినిమాకి సీక్వెల్ ప్రకటించాడు.
రాక్షసుడు 2 టైటిల్ తో ఈ సినిమాని ప్రకటించి ఒక పోస్టర్ విడుదల చేసారు. మొదటి పార్ట్ లో ఉన్న బొమ్మ లాంటిదే రెండు బొమ్మలని తగిలించాడు. ఒక పెద్ద రక్తమోడుతున్న కత్తిని చూపించి బ్యాక్ గ్రౌండ్ లో తెల్లని వస్త్రం తో మూట కట్టి ఉన్న ఒక మనిషిని బుజం పై వేసుకుని చేతిలో గొడ్డలి పట్టుకుని ముందుకు వెళ్తున్న ఒక వ్యక్తిని వెనకనుండి చూపించారు. మరి కొద్ది రోజుల్లో షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు ప్రకటించారు.
ఈ సినిమాలో ఒక పెద్ద హీరో నటించనున్నట్టు తెలిపారు కానీ ఎవరు అనేది అధికారికంగా ప్రకటించలేదు. హీరో హవీష్ కి సంబందించిన హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మొదటి పార్ట్ కి సంగీతం అందించిన గిబ్రాన్ రెండవ పార్ట్ కి కూడా సంగీతం అందిస్తున్నారు.