టాలీవుడ్: 1989 లో బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరో గా ‘మైనే ప్యార్ కియా’ అనే సినిమా బాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సల్మాన్ కి జోడీ గా నటించిన ‘భాగ్య శ్రీ’ బాగా పేరు సంపాదించింది. కానీ ఎక్కువ సినిమాలు చేయకుండానే సినిమాలు ఆపేసింది. తెలుగు లో నందమూరి బాలకృష్ణ కి చెల్లెలి పాత్రలో ‘రాణా’ అనే ఒకే ఒక్క సినిమాలో నటించింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ నటి సినిమాల్లోకి కం బ్యాక్ అవుతుంది. అది కూడా తల్లి పాత్రలో. అది కూడా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో సినిమాతో.
ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ లో భాగ్యశ్రీ ప్రభాస్ కి తల్లి పాత్రలో నటిస్తుంది. భాగ్య శ్రీ ట్వీట్ చేస్తూ మిస్సింగ్ షూటింగ్ అని రాధే శ్యామ్ షూటింగ్ అని పెట్టి ఒక ఫోటో విడుదల చేసింది. ఈ లుక్ ఫస్ట్ లుక్ అనలేం కానీ సినిమా టైం పీరియడ్ కి తగట్టు ఉంది. అది కూడా రాధే శ్యామ్ అని మెన్షన్ చేయడం తో ఈ సినిమాలో భాగ్యశ్రీ లుక్ ఇలాగే ఉండబోతుందని అర్ధం అవుతుంది. ఈ సినిమా ద్వారా భాగ్య శ్రీ మరో సారి బిజీ నటి అవ్వాలని ఆశిద్దాం.