టాలీవుడ్: ప్రస్తుతం ప్రభాస్ వరుసగా నటిస్తున్న సినిమాల్లో ముందు రాబోయే సినిమా ‘రాధే శ్యామ్’. సెకండ్ వేవ్ లేకుంటే ఈ రోజు ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్నీ సినిమాలు, షూటింగ్ లు వాయిదాలు పడడం తో ఈ సినిమా కూడా వాయిదా వేశారు. నిన్ననే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ రోజు విడుదల అప్ డేట్ విడుదల చేసారు. ఈ సినిమాని 2022 మకర సంక్రాతి సందర్భంగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈ పండగ సీజన్ కి మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ -రానా నటిస్తున్న అయ్యప్పణ్ణుమ్ కోశియుమ్ సినిమాలు రిలీజ్ ని ప్రకటించాయి. ఈ సినిమాతో ఒక్క టాలీవుడ్ నుండి ముగ్గురు పెద్ద హీరోలు ఒకే సారి విడుదల చేయడం ఆసక్తి కలిగించే అంశం.
యూవీ క్రియేషన్ వారితో గోపి చంద్ తో ‘జిల్’ సినిమాని రూపొందించి హిట్ కొట్టిన రాధా కృష్ణ అదే బ్యానర్ లో ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఒక పూర్తి లవ్ స్టోరీ గా ఈ సినిమా రూపొందింది. 1960 ల్లో యూరప్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందింది. మూవీ రిలీజ్ డేట్ పిక్చర్ లో కూడా ప్రభాస్ బ్యాక్ డ్రాప్ లో యూరప్ కట్టడాలు చూడవచ్చు. బ్యాక్ డ్రాప్ లో జోడియాక్ సైన్స్ కి సంబందించిన సింబల్స్ చూపించారు. మిస్టర్ పర్ఫెక్ట్ లుక్ లో ప్రభాస్ ఆకట్టుకున్నాడు. విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, ప్రేరణ పాత్రలో పూజ హెగ్డే ఒక మంచి లవ్ స్టోరీ చూపించబోతున్న ఫీల్ ని ఆల్రెడీ కలిగించారు. డియర్ కామ్రేడ్ తో సూపర్ ఆల్బమ్ ని అందించిన జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.