
టాలీవుడ్: సినిమా అప్ డేట్స్ విడుదల చేయమని రిక్వెస్ట్ చేస్తారు కానీ తిట్లు , ట్రోల్ల్స్ మాత్రం ప్రభాస్ సినిమాని రూపొందిస్తున్న మేకర్స్ కి తప్పట్లేదు. సాహో సినిమాను నిర్మించిన యూవీ క్రియేషన్స్ కి ఈ ట్రోల్ల్స్ తప్పలేదు. ఇపుడు రాధే శ్యామ్ నిర్మిస్తున్న అదే ప్రొడక్షన్ హౌస్ కి మరలా తప్పట్లేదు. ఈ సారి డైరెక్టర్ ‘రాధా కృష్ణ’ ని ఇంకా ఎక్కువగా ట్రోల్ చేసారు ఫాన్స్.
2018 లోనే ప్రారంభం అయిన రాధే శ్యామ్ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సింది. కానీ ఎన్నో కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది. సెకండ్ వేవ్ కన్నా ముందే షూటింగ్ అయిపోయింది అనుకున్నారు కానీ ఇంకా కొంత బాలన్స్ ఉండడం తో ఈ మధ్యనే మూడు రోజులు షూట్ చేసి పూర్తి చేసారు. ఈ రోజే ఈ సినిమా షూట్ పూర్తి అయిందని డైరెక్టర్ రాధ కృష్ణ ఒక ట్వీట్ పెట్టి మరో మూడు రోజుల్లో అప్ డేట్ రాబోతుందని ఫాన్స్ కి తీపి కబురు తెలిపారు.
పూర్తిగా యూరోప్ బ్యాక్ డ్రాప్ లో 1960 కాలం నాటి సినిమాగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఒక ఫుల్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ గా తెరకెక్కింది. విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, ప్రేరణ పాత్రలో పూజ హెగ్డే ఫస్ట్ లుక్ ఆకట్టుకున్నాయి. రోమియో జూలియట్ డైలాగ్ కి సంబందించిన టీజర్ కూడా ఆకట్టుకుంది. డియర్ కామ్రేడ్ తో మంచి మ్యూజిక్ అందించిన జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి సౌత్ బాషలన్నిటికి సంగీతం అందిస్తున్నాడు. థర్డ్ వేవ్ లేకపోతే మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా రిలీజ్ అప్ డేట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.