హైదరాబాద్: డాక్టర్ అవ్వాల్సిన వాళ్ళు యాక్టర్ అయ్యాము అని ఒక సామెత చాలా ప్రసిద్ధి. ఇప్పుడు చాల మంది పేరు వచ్చిన తర్వాత వాళ్ళ టాలెంట్స్ ని మెల్లి మెల్లిగా బయటకి తీస్తున్నారు. హీరోలు, హీరోయిన్స్ పాటలు పాడడం, సినిమాలు నిర్మించడం, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ యాక్ట్ చేయడం ఇదివరకే అడపాదడపా కనిపించిన ఈ మధ్య కామన్ అయిపోయింది. సరిగ్గా అదే బాటలో నడుస్తున్నాడు రఘు కుంచె. యాంకర్ గ తన సినీ ప్రస్తానం మొదలు పెట్టిన రఘు కుంచె తర్వాత సింగర్ గా ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా ఇప్పుడు యాక్టర్ గా కూడా బిజీ ఐతున్నాడు. ఇదివరకే ‘పలాస 1978’ లో రఘు కుంచె చేసిన నటనకి మంచి పేరు వచ్చింది.
ప్రస్తుతం రాజీవ్ గాంధీ హత్య ఉదంతం పైన ‘కథా నళిని’ అనే సినిమాని ‘గో గో ‘ బ్యానర్ పై కొక్కిరిగడ్డ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రఘు కుంచె మురుగన్ అనే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. దీనికి సంబంధించి రఘు కుంచె ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు ఈ సినిమా టీం. 1991లో జరిగిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్య సంఘటన కథాంశంతో ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. రాజీవ్ హత్య కేసులో మొదట్లో మరణశిక్ష పడి, అనంతరం అది యావజ్జీవ శిక్షగా మారడంతో జైలు జీవితాన్ని గడుపుతున్న ప్రధాన దోషులలో ఒకడైన మురుగన్ పాత్రను ఈ చిత్రంలో రఘు కుంచె పోషిస్తున్నారు.