ఏపీ: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబు విచారణకు హాజరుకాలేదు.
ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌కు లేఖ రాస్తూ, రాలేనని, కొంత సమయం కావాలని కోరాడు. తులసిబాబుపై రఘురామ ఛాతీపై కూర్చుని టార్చర్ చేశాడనే ఆరోపణలున్నాయి.
ఇందుకు ముందు రఘురామకృష్ణరాజు తన లేఖలో తులసిబాబును విచారణకు పిలిచినప్పుడు అతడిని గుర్తు పట్టే అవకాశం ఇవ్వాలని కోరారు.
టార్చర్ ఘటనలో తులసిబాబు పాత్రపై విచారణ కొనసాగుతోంది. ఇక ఈ కేసులో 5వ నిందితురాలిగా ఉన్న డాక్టర్ ప్రభావతికి ముందస్తు బెయిల్ కోర్టు నిరాకరించింది.
నిందితులతో కుమ్మక్కు అయ్యారని ప్రాసిక్యూషన్ తరఫున కోర్టుకు వివరించారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ప్రభావతికి రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది.