మూవీడెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC16 షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు.
కాగా, ఈ మూవీ పీరియాడికల్ జోనర్ లో, ఉత్తరాంధ్ర ప్రాంతం నేపథ్యంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది.
ఇదిలా ఉండగా, ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
హీరోయిన్గా జాన్వీ కపూర్ ఎంపిక కావడంతో పాటు, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.
అయితే, ఇది రెహమాన్‌కు ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని, ఇప్పటికే 4 సాంగ్ ట్యూన్స్ రెడీ చేశాడని టాక్.
సినిమా షూటింగ్ మొదలు కాకముందే సంగీతం పూర్తవ్వడం అనేది ప్రత్యేకమైన విశేషం.
మొదటి షెడ్యూల్లోనే సాంగ్స్ షూట్ చేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే, రామ్ చరణ్ పాత్రకు సంబంధించి హ్యూమర్ టచ్ కూడా ఉంటుందని చరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఉత్తరాంధ్ర స్లాంగ్‌లో డైలాగ్స్ ఉండే ఈ సినిమా, అభిమానుల్లో పెద్ద ఎత్తున ఆసక్తిని రేకెత్తిస్తోంది.
రామ్ చరణ్ ప్రస్తుతం క్యారెక్టర్ కోసం మేకోవర్‌లో బిజీగా ఉన్నారు, త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.