ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి అనుసంధానంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ ప్రసంగం ముగిసిన తర్వాత మీడియా ప్రతినిధులు స్పందన కోరగా, రాహుల్ గాంధీ అనూహ్యంగా “బోరింగ్” అని వ్యాఖ్యానించారు.
రాహుల్ ఈ మాట అనడంతో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రత్యేకించి, రాష్ట్రపతి ప్రసంగంపై అలాంటి కామెంట్లు చేస్తావా? అంటూ రాహుల్ వైపు సోనియా కోపంగా చూసినట్టున్నారు. దీంతో, తన వ్యాఖ్య తప్పుగా వెళ్లిందని గ్రహించిన రాహుల్ వెంటనే “సారీ” చెప్పేశారు.
తన వ్యాఖ్య వెనక్కి తీసుకుంటూ, రాష్ట్రపతి ప్రసంగం కీలక అంశాలను ప్రస్తావించలేదని, ప్రధానంగా మోదీ ప్రభుత్వ ప్రణాళికలనే వివరించారని చెప్పారు.
తన మాట వల్ల పెద్ద వివాదం రేగకుండా వెంటనే స్పందించిన రాహుల్, మీడియా ముందే తన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఒకవేళ వెంటనే సారీ చెప్పకుండా ముందుకు సాగితే, ఈ వ్యాఖ్య పెద్ద దుమారమే రేపేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.