తెలంగాణ: తెలంగాణలో యువతపై జరుగుతున్న వివక్షలకు ముగింపు పలకాలని కోరుతూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. విద్యా సంస్థల్లో జరిగే అసహనం, జాతి ఆధారిత వివక్ష కారణంగా భవిష్యత్తు ఉన్న యువకులు జీవితాలను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రోహిత్ వేముల, పాయల్ తడ్వి, దర్శన్ సోలంకి వంటి విద్యార్థుల మృత్యువుల్ని ప్రస్తావించిన రాహుల్.. ఈ దారుణాలు మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చట్టం అవసరమన్నారు. ‘రోహిత్ వేముల చట్టం’ రూపొందించి అమలు చేయాలని స్పష్టంగా రేవంత్‌కు సూచించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలల్ని నిలబెట్టే విధంగా ఈ చట్టం ఉండాలని రాహుల్ అభిప్రాయపడ్డారు. వివక్షకు గురవుతున్న విద్యార్థులకు న్యాయం అందేలా వ్యవస్థ ఉండాలని అన్నారు.
ఇలాంటి చట్టం ద్వారా భవిష్యత్‌లో ఎవరూ వివక్షకు గురికాకుండా చూసే దిశగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇది విద్యార్థుల హక్కుల పరిరక్షణకు కీలకంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇప్పటికే కర్ణాటక సీఎంకు కూడా ఇదే మేరకు లేఖ రాసిన రాహుల్.. ఇప్పుడు తెలంగాణకు కూడా ప్రత్యేకంగా రాశారు.