మహారాష్ట్ర: వచ్చే ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఎన్నికలలో రిజర్వేషన్ల అంశాన్ని తమ ప్రధాన అస్త్రంగా మార్చుకుంటామని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు.
ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో రిజర్వేషన్ల 50% పరిమితిని ఎత్తివేస్తామని, అలాగే కులగణనను చేపట్టేందుకు తాము బలంగా కట్టుబడి ఉన్నామని తెలిపారు.
రిజర్వేషన్ల అంశంపై మహారాష్ట్ర పట్టణ ప్రాంత ప్రజలు అంగీకారం వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ అంచనా వేసింది. ఇది రాహుల్ గాంధీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.
యువతను ఆకర్షించేందుకు మహారాష్ట్ర నుంచి పెద్ద ప్రాజెక్టులను గుజరాత్‌కు తరలించిన అంశాన్ని కాంగ్రెస్ ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తోంది.
ఫాక్స్‌కాన్, ఎయిర్‌బస్ వంటి ప్రాజెక్టులను రాష్ట్రం నుంచి తొలగించడం మహారాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలను దూరం చేశాయని రాహుల్ విమర్శించారు.
మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడటమే తమ లక్ష్యమని, మహా వికాస్ అఘాడీ ద్వారా సామాజిక న్యాయం, సంక్షేమాన్ని పునరుద్ధరిస్తామని రాహుల్ చెప్పారు.
రిజర్వేషన్ల పరిమితి తొలగించడం ద్వారా సామాజిక సమానత్వానికి నాంది పలుకుతామని, ఈ చారిత్రక నిర్ణయం దేశవ్యాప్తంగా కొత్త మార్గాలను తెరుస్తుందని ఆయన పేర్కొన్నారు.