తెలంగాణ: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధిక శ్రేణిలో గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి, యువ నేతగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం రాహుల్ గాంధీతో ఉన్న అనుబంధం మీద రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నవంబర్ 6 నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కులగణన సర్వే కోసం రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
అక్టోబర్ 5న బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కులగణనపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, అందులో రాహుల్ పాల్గొంటారని అన్నారు.
రాహుల్ గాంధీ పర్యటనను పార్టీ పరంగా మాత్రమే ప్రకటించడం, ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం పలు వాదనలకు దారి తీస్తోంది. ఇది రాహుల్, రేవంత్ మధ్య గ్యాప్ ఉన్నదని చెప్పడానికే చక్కటి ఉదాహరణగా చూస్తున్నారు.
ఈ సందర్భంలో రాహుల్ గాంధీ రేవంత్‌ను పక్కనపెట్టారని, అందుకే సమావేశం పీసీసీ చీఫ్ ద్వారా నిర్వహిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే సమయంలో రేవంత్ సన్నిహితులు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తూ, పార్టీ నాయకుడిగా రాహుల్‌ను ఆహ్వానించడం ఒక పద్ధతిగా చెబుతున్నారు. రాహుల్ గాంధీ పర్యటన వెనుక ఉన్న అసలు కారణం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.