టాలీవుడ్: ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో రాహుల్ రామకృష్ణ ఒకరు. తన నటన, వాక్చాతుర్యం తో ప్రేక్షకులని ఇట్టే తన వైపు తిప్పేసుకుంటాడు ఈ నటుడు. వరుసగా సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ తన కంటే కొద్దిగా సీనియర్ అయిన ప్రియదర్శి ని ఫాలో అవుతున్నాడు. రాహుల్ రామకృష్ణ నటించిన ‘నెట్’ అనే వెబ్ సిరీస్ కి సంబందించిన టీజర్ విడుదలైంది. ఇందులో రాహుల్ రామకృష్ణ తో పాటు అవికా గోర్ నటిస్తుంది.
రాహుల్ రామకృష్ణ పెళ్లి అయిన ఒక మిడిల్ క్లాస్ భర్త పాత్ర పోషిస్తున్నాడు. ఈ సిరీస్ లో సెక్యూరిటీ కెమెరాస్ ఫిట్ చేసి రిపేర్ చేసే టెక్నీషియన్ గా రాహుల్ పని చేస్తుంటాడు. ఆలా ఒక దగ్గర ఫిక్స్ చేసిన సీసీ కెమెరా విజువల్స్ ని తన ఫోన్ లో చూస్తుంటాడు. ఆ విజువల్స్ లో ఉండే ఇంట్లో అవికా గోర్ ఉంటుంది. అవికా గోర్ పర్సనల్ లైఫ్ ని అబ్సర్వ్ చేస్తున్న రాహుల్ అవికా ప్రమాదం లో ఉందని తెలుసుకుంటాడు, అనుకోకుండా రాహుల్ కూడా కొత్త ఇబ్బందుల్లో పడతాడు. ఇలా సస్పెన్స్ రైడ్ గా టీజర్ విడుదల చేసి సిరీస్ పైన ఆసక్తి కలుగచేసారు మేకర్స్.
‘ఉయ్యాలా జంపాల’ ,’ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాల ద్వారా సక్సెస్ సాధించి చాలా రోజుల తరువాత ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ మళ్ళీ సక్సెస్ కోసం ఎదురు చూస్తుంది అవికా. తమాడా మీడియా బ్యానర్ పై రాహుల్ తమాడా, సందీప్ రెడ్డి బోర్రా ఈ సిరీస్ ని నిర్మిస్తున్నారు. భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహించిన ఈ సిరీస్ సెప్టెంబర్ 10 నుండి జీ 5 ఓటీటీ లో స్ట్రీమ్ అవనుంది.