fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsపంచతంత్రం - రాహుల్ విజయ్ ఫస్ట్ గ్లిమ్ప్స్

పంచతంత్రం – రాహుల్ విజయ్ ఫస్ట్ గ్లిమ్ప్స్

RahulVijay FirstGlimpseFrom Panchatantram

టాలీవుడ్: ఫైట్ మాస్టర్ విజయన్ కుమారుడు రాహుల్ విజయ్ హీరోగా ‘ఈ మాయ పేరేమిటో’ అనే సినిమాతో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల తో ‘సూర్యకాంతం’ అనే సినిమాలో నటించాడు. రెండు సినిమాలు చేసిన హీరోగా అంత గుర్తింపు రాలేదు ఈ హీరోకి. ప్రస్తుతం మూడవ ప్రయత్నంగా ‘పంచతంత్రం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రాహుల్ విజయ్ పాత్రకు సంబందించిన ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో ని విడుదల చేసింది సినిమా టీం. నిన్న రాహుల్ విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ వీడియో ని విడుదల చేసింది.

ఈ సినిమాలో రాహుల్ విజయ్ సుభాష్ అనే పాత్రలో కనిపించనున్నాడు. రాహుల్ విజయ్ ఒక కార్ లో వచ్చి దిగే సీన్ ని ఇంట్రొడ్యూసింగ్ సుభాష్ అని ఒక వీడియో విడుదల చేసింది సినిమా టీం. ఈ వీడియో చూసాక అసలు ఏముంది ఈ వీడియో లో హీరో ని సరిగ్గా చూపించను కూడా చూపించలేదు.. నార్మల్ ఫోన్ లో షూట్ చేసినట్టుంది అని అనిపించక మానదు. టికెట్ ఫ్యాక్టరీ బ్యానర్ పై అఖిలేష్ వర్ధన్ , సురేష్ యర్రబోలు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో చాలా మంది కొత్త మరియు చిన్న నటులు నటిస్తున్నారు. హర్ష పులిపాక దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular