భారతీయ రైల్వే శాఖ భారీ నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల కోసం మొత్తం 9,970 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా రైల్వేలో ఉద్యోగం కోరేవారికి మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. అర్హత విషయానికొస్తే, పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ చేసినవారు, డిప్లొమా లేదా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థుల వయస్సు 2025 జూలై 1 నాటికి గరిష్ఠంగా 30 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు సంబంధించి వయో సడలింపు ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అభ్యర్థులు మే 11వ తేదీలోపు రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో (www.indianrailways.gov.in) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (CBT) ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు విషయానికొస్తే, జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.250 మాత్రమే చెల్లించాలి. దరఖాస్తు చేసిన తర్వాత పరీక్ష తేదీలను రైల్వే అధికారులు త్వరలో ప్రకటించనున్నారు.