హైదరాబాద్: తెలంగాణ లో పలు చోట్ల వర్షం పలకరించింది. కాగా హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. సిటీలోని బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, సంజీవ్ రెడ్డి నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, బోరబండ, కుత్బుల్లాపూర్, ఎల్‌బీనగర్‌లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసాయి. దీంతో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందిని జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.
కాగా తెలంగాణలో బుధవారం కూడా ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇంఖా అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగళ్లతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశము కూడా ఉందని తెలిపింది.
అలాగే ఈ నెలలో 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పలు చోట్ల ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. కాగా, గత 24 గంటల్లో కామారెడ్డి జిల్లా బొమ్మనదేవిపల్లిలో అత్యధికంగా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.