fbpx
Tuesday, January 7, 2025
HomeTelanganaరైతు భరోసా పెంపు: మంత్రి పొన్నం కీలక ప్రకటన

రైతు భరోసా పెంపు: మంత్రి పొన్నం కీలక ప్రకటన

raitu-bharosa-increased-to-12k

హైదరాబాద్: రైతు భరోసా పథకంపై విపక్షాలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నగదు పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు.

అంతేకాకుండా, పథకం కింద ఇప్పటి వరకు ఇచ్చిన రూ.10 వేలను రూ.12 వేలకు పెంచినట్లు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులున్నా, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు.

అదేవిధంగా, రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం జనవరి 26న నుంచి ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు మంత్రి ప్రకటించారు.

గత పదేళ్లుగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడం వల్ల చాలామంది సమస్యలు ఎదుర్కొన్నారని, ఈ కార్యక్రమంతో ఆ సమస్యలు తీరుతాయన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా జరుగుతోందని, నియోజకవర్గానికి 3,500 ఇళ్ల కేటాయింపు ప్రగతి దశలో ఉందని మంత్రి వెల్లడించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, విమర్శలు అర్థరహితమని పొన్నం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular