మూవీడెస్క్: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న “ది రాజాసాబ్” సినిమా హార్రర్ కామెడీ జానర్ లో రూపొందుతోంది.
ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన టీజర్ కి మంచి స్పందన లభించింది.
ఇందులో ప్రభాస్ స్టైలిష్ లుక్ లో కనిపించడంతో పాటు, చాలా కాలం తర్వాత ఆయన డాన్స్ చేస్తారని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వెల్లడించారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ కోసం ఐకాన్ మ్యూజిక్ సౌత్ కంపెనీ భారీ డీల్ ఫిక్స్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది సుమారు 15 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. టీజర్ విడుదల తర్వాత సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.
థమన్ సంగీతం అందించిన ఈ ఆల్బమ్ కు భారీ రెస్పాన్స్ ఉండబోతుందని కూడా ఇండస్ట్రీలో టాక్ ఉంది.
ఐకాన్ మ్యూజిక్ ఇప్పటికే కొన్ని సౌత్ సినిమాల మ్యూజిక్ రైట్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు “ది రాజాసాబ్” ఆడియో రైట్స్ కూడా దక్కించుకోవడం ద్వారా ఈ సంస్థకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే మరో క్రేజీ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.