మూవీడెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కనున్న SSMB 29 చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
సెట్స్ పైకి వెళ్లక ముందే ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి నెలకొంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఓ అప్డేట్ రాబోతుందనుకుంటే నిరాశ ఎదురైంది.
ఇదిలా ఉండగా, రాజమౌళి కుమారుడు కార్తికేయ ఇటీవల జీప్ లో ఫారెస్ట్ సఫారీ చేస్తూ పోస్ట్ చేసిన వీడియోలు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించాయి.
ప్రస్తుతం రాజమౌళి టీమ్ సౌతాఫ్రికాలోని వివిధ లొకేషన్లలో ఉన్నట్లు సమాచారం.
ఇది SSMB 29 కోసం ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ అడ్వెంచర్ మూవీ కావడంతో షూటింగ్ లొకేషన్ల కోసం సెర్చ్ చేస్తున్నారని టాక్.
రియల్ లొకేషన్స్ లోనే ఎక్కువ భాగం షూట్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
సౌతాఫ్రికా అడవుల్లో మరింత యూనిక్ లొకేషన్స్ ను ఎంపిక చేసేందుకు రెక్కీ పనులు జరుగుతున్నాయి.
ఈ సినిమా కథను విజయేంద్ర ప్రసాద్ అందించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, దుర్గా ఆర్ట్స్ పై భారీ బడ్జెట్ తో కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.
2025 సంక్రాంతి తర్వాత మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని టాక్.