ఇండియన్ సినీ హిస్టరీలోనే భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఇటీవలే సైలెంట్‌గా సెట్స్ పైకి వెళ్లింది. హైదరాబాద్ శివార్లలో వేసిన భారీ సెట్లో షూటింగ్ శరవేగంగా సాగుతున్నట్లు సమాచారం.
అయితే, ఈ మూవీ ప్రారంభం గురించి చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇవ్వకపోవడం అభిమానుల్లో కొంత నిరాశ కలిగించింది.
మామూలుగా రాజమౌళి తన సినిమాల ప్రారంభానికి ముందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కథాంశం, నటీనటుల వివరాలు పంచుకోవడం పరిపాటిగా ఉంటుంది. కానీ ఈసారి అలా జరగకపోవడం గమనార్హం.
అయితే, తాజా సమాచారం ప్రకారం, మొదటి షెడ్యూల్ పూర్తైన తర్వాత మార్చి చివర లేదా ఏప్రిల్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారట.
ఆ ప్రెస్ మీట్‌లో రాజమౌళి ఈ సినిమా కథాంశం, కాస్ట్ అండ్ క్రూ వివరాలను వెల్లడిస్తారట. అలాగే, రిలీజ్ డేట్ కూడా ప్రకటించే అవకాశం ఉంది.
వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందని సమాచారం.