fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsవేట మొదలుపెట్టిన రాజమౌళి

వేట మొదలుపెట్టిన రాజమౌళి

RAJAMOULI-STARTED-LOCATION-SEARCH-FOR-SSMB29
RAJAMOULI-STARTED-LOCATION-SEARCH-FOR-SSMB29

మూవీడెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కలయికలో రాబోతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తవగా, సుమారు 1000 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు సమాచారం.

కెఎల్ నారాయణ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి లొకేషన్ల ఎంపిక పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ఆయన ఫారెస్ట్ ప్రాంతంలో జీప్‌లో ప్రయాణిస్తుండగా తనయుడు కార్తికేయ షూట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియో చూస్తే రాజమౌళి, మహేష్ పాత్రకు అవసరమైన అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో నిజమైన లొకేషన్ల కోసం శ్రద్ధగా వెతుకుతున్నట్లు అర్ధమవుతోంది.

ఈ ప్రాజెక్ట్‌లో మహేష్ బాబు వరల్డ్ ట్రావెలర్ పాత్రలో కనిపించనున్నారు.

అంతేకాకుండా, హాలీవుడ్ నటుల నుండి కూడా క్యాస్టింగ్ కోసం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

‘SSMB29’ నుంచి మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular