మూవీడెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్, లైకా ప్రొడక్షన్ మధ్య బంధం ‘రోబో 2.ఓ’ నుంచి స్టార్ట్ అయ్యింది. ఆ సినిమా కోసం లైకా వారు భారీగా 570 కోట్ల బడ్జెట్ పెట్టారు.
మంచి టాక్ వచ్చినప్పటికీ, ఆ సినిమా బ్రేక్ ఈవెన్ చేరలేదు. ఆ నష్టాలను పూడ్చడంలో భాగంగా రజినీకాంత్ తరువాత లైకా బ్యానర్ పై ‘దర్బార్’ చేశారు.
కానీ, అది కూడా కమర్షియల్ పరంగా సక్సెస్ కాలేకపోయింది.
‘లాల్ సలామ్’లో అతిథి పాత్రలో కనిపించిన రజినీకాంత్, తర్వాత ‘వేట్టయ్యన్’ సినిమా చేశారు.
ఈ ప్రాజెక్ట్ మీద కూడా భారీ అంచనాలు ఉండగా, ఆశించిన రీతిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది.
సినిమా బడ్జెట్ కంటే ఖర్చు పెరగడంతో లైకా ప్రొడక్షన్ కోసం రజినీకాంత్ మరో సినిమా చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ చిత్రంలో నటిస్తుండగా, తరువాత ‘జైలర్ 2’ కోసం సిద్దమవుతున్నారు.
ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక, లైకా ప్రొడక్షన్ తో మరో సినిమా చేయడానికి ఆయన ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.