టాలీవుడ్: టాలీవుడ్ సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ తన తదుపరి సినిమాని ప్రకటించాడు. తన చివరి మూవీ ‘కల్కి’ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఇపుడు మరో సినిమాతో రాబోతున్నాడు. తన 91 వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు విడుదల చేసారు. ఈ సినిమాని ‘శేఖర్’ – ది మాన్ విత్ స్కార్ అనే ఉప శీర్షిక తో ఈ సినిమా రాబోతుంది. ఈ రోజు రాజ శేఖర్ పుట్టిన రోజు పురస్కరించుకుని ఈ అనౌన్స్మెంట్ చేసారు రాజ శేఖర్.
ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఒక వయసైన పాత్రలో రాజశేఖర్ కనిపించనున్నట్టు అర్ధం అవుతుంది. కొంచెం ఏజ్ ఉన్న లుక్ తో తెల్ల గడ్డం తో ఓన్లీ సగం మొహం చూపించారు మేకర్స్. తమ్మా రెడ్డి భరద్వాజ సమర్పణలో లక్ష్య ప్రొడక్షన్స్ మరియు పెగాసస్ సినీ కార్పొరేషన్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. నూనత దర్శకుడు లలిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యం లో ఈ సినిమా రానుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించి ఈ సంవత్సరంలోనే ఈ సినిమా విడుదల చెయ్యాలని రాజ శేఖర్ ఉన్నట్టు తెలుస్తుంది.