న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా భారత దేశంలో మళ్ళీ కరోనా వైరస్ విజృంభన జరుగుతోంది. క్రమంగా దేశంలో రోజువారీ కేసులు విపరీతంగా పెరుగుదల నమోదవుతున్నాయి.
క్రితం సారి లాగానే సామాన్యుల నుంచి సెలబ్రిటీలు మరియు ప్రజా ప్రతినిధుల వరకు అందరూ ఈ కరోనా మహమ్మారి వలలో పడుతున్నారు. తాజాగా భారత రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్‌నాథ్ సింగ్ కూడా కోవిడ్ పాజిటివ్ గా పరీక్షింప బడ్డారు.
తనకు కరోనా వైరస్ సోకిన విషయాన్ని రాజ్ నాథ్ సింగ్ స్వయంగా తన ట్విటర్లో ప్రకటించారు. తనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, స్వల్వ లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.