టాలీవుడ్: ఉగాది సందర్భంగా థియేటర్ లలో విడుదల కావాల్సిన సినీమా ‘ఒరేయ్ బుజ్జిగా’ కానీ కరోనా కారణంగా ఇన్ని రోజుల తర్వాత ఇవాళ ‘ఆహా’ ఓటీటీ లో విడుదల అయింది. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ‘ఒక లైలా కోసం’ వంటి చిత్రాలను అందించిన విజయ్ కుమార్ కొండా ఈ సినిమాకి దర్శకత్వం వచించారు.
ముందు చెప్పిన రెండు సినిమాల లాగానే ఈ సినిమాకి కూడా అదే థీమ్ ఎంచుకున్నాడు డైరెక్టర్. లవ్ స్టోరీ అయినప్పటికీ తన ముందు సినిమాల్లో వాడిన ఫార్ములానే ఇందులో వాడాడు. హీరో హీరోయిన్ మధ్య ఒక కన్ఫ్యూషన్ , ఇద్దరిలో ఎవరో ఒకరికి ఏం జరుగుతుందో క్లారిటీ ఉంటుంది.. కానీ చివరకి వచ్చేసరికి వీళ్ళకి తెలియకుండా బ్యాక్ గ్రౌండ్ లో ఇంకొక కన్ఫ్యూషన్ క్రియేట్ చేయబడి ఉంటుంది. తన మొదటి రెండు సినిమాల్లో కూడా ఇదే ప్లాన్ తో తీసాడు విజయ్. గుండె జారీ గల్లంతయ్యిందే సూపర్ హిట్ అయినా, కూడా అదే కాన్సెప్ట్ కొంచెం అటు ఇటు గా వచ్చిన ‘ఒక లైలా కోసం’ యావరేజ్ అనిపించింది. ఇపుడు ఈ సినీమా అయితే మరీ రిపీటెడ్ అనిపించింది. ఇంకా కామెడీ అయితే పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఉదాహరణకి హాస్పిటల్ లో రాజ్ తరుణ్ కి , సప్తగిరి, సీనియర్ హీరో నరేష్, హీరోయిన్ మధ్య సాగే కామెడీ మరీ చిరాకు గా అనిపిస్తుంది అలాగే చాలా సాగదీశాడని అనిపిస్తుంది.
నటీనటుల విషయానికోస్తే రాజ్ తరుణ్ మరీ రొటీన్ కథలు ఎంచుకుంటున్నాడు అనిపిస్తుంది. స్వతహాగా డైరెక్టర్ అవుదామనుకొని ఇండస్ట్రీ కి వచ్చి హీరో అయిన నటుడు డైరెక్టర్ విజన్ తో కథలు ఎంచుకుంటే ఇండస్ట్రీ లో నిలదొక్కుగలడేమో అనిపిస్తుంది. హీరో నితిన్, నిఖిల్ కూడా ముందు ఇలాంటి సినిమాలు చేసి తర్వాత వాల్ల దారి మార్చి సక్సెస్ బాట పట్టారు. రాజ్ తరుణ్ కూడా చాలా తొందరగా రొటీన్ సినిమాలు మార్చి మంచి కథలు నమ్ముకుంటే బెటర్. హీరోయిన్ మాళవిక నాయర్ తన పాత్రకి తగ్గట్టు సరిపోయింది. తాను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న యాక్ట్రెస్ , ఈ సినిమాలో తనకి ప్రూవ్ చేసుకోవడానికి పెద్దగా స్కోప్ ఏమి లేదు. హెబ్బా పటేల్ తన పాత్రకి తగ్గట్టు నటించింది. సీనియర్ యాక్ట్రెస్ నరేష్, పోసాని, సత్యం రాజేష్, మధు.. తమ తమ పాత్రల్లో మెప్పించారు. సీనియర్ హీరోయిన్ వాణి విశ్వనాధ్ పాత్ర ప్రత్యేకత ఏమీ లేదు కానీ తన వారికి తాను పరవాలేదనిపించారు.
టెక్నిషియన్స్ విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ కి పెద్దగా ప్రూవ్ చేసుకోవడానికి ఏమి లేదనిపించింది. తన ప్రత్యేకతను చాటుకునే అవకాశం ఎక్కడ లేదు. అనూప్ రూబెన్స్ సంగీతం పెద్దగా ఏమి మెప్పించలేదు. సినీమా చూసినంత వారికి ఒకటి రెండు పాటలు పర్వాలేదనిపిస్తాయి కానీ అంతగా గుర్తుండిపోయే పాటలేమి కాదు. బాగ్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా ఏమీ లేదు. సినిమాకి మాటలు అందించిన నంద్యాల రవి కొన్ని చోట్ల ఆకట్టుకున్నాడు. డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా విషయానికి వస్తే అతను తనకి అలవాటైన కథన మరొక ఎన్విరాన్మెంట్ లో తీసాడు అనిపిస్తుంది. కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. స్క్రీన్ ప్లేలో కానీ.. కామెడీ సన్నివేశాల్లో కానీ కొత్తదనం కనిపించదు. సినిమాపై ఆసక్తి ని కలిగించడం లో విఫలమయ్యాడు అని చెప్పుకోవచ్చు.
ఓవరాల్ గా చెప్పాలంటే బుజ్జిగాడు మరీ రొటీన్ అనిపించాడు