టాలీవుడ్: రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన సినిమా ‘ఒరేయ్ బుజ్జిగా’. థియేటర్లు తెరచుకొని కారణంగా ఈ సినిమాని అక్టోబర్ 2 నుండి ఆహా ఓటీటీ లో విడుదల చేస్తున్నారన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు మేకర్స్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గ రూపొయిందిన ఈ సినిమా ట్రైలర్ ని నాగ చైతన్య విడుదల చేసారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘కల్యాణ వైభోగమే’ లాంటి సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ‘మాళవిక నాయర్’ ఈ సినిమాలో రాజ్ తరుణ్ కి జోడి గ నటించింది. అలాగే మరొక పాత్రలో హెబ్బా పటేల్ కూడా నటించింది.
‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రానికి ‘గుండజారి గల్లంతయ్యిందే’ ‘ఒక లైలా కోసం’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వచించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె.రాధామోహన్ నిర్మించారు.వాణీ విశ్వనాథ్ – సీనియర్ నరేష్ – పోసాని కృష్ణమురళి – అనీష్ కురువిళ్ళ – సప్తగిరి – రాజారవీంద్ర – అజయ్ ఘోష్ – సత్యం రాజేష్ – సత్య ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఐ. ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చాడు.