శాండల్ వుడ్: తెలుగులో 2020 జనవరి 1 న ‘అతనే శ్రీమన్నారాయణ’ అనే ఒక డబ్ సినిమా విడుదల అయ్యింది. సినిమా బాగున్నప్పటికీ చాలా మందికి ఈ సినిమా గురించి తెలియదు. సినిమా ప్రొమోషన్ లేకనో, లేక హీరో మొఖం తెలియకనో సినిమా అంతగా ఆడలేదు. ఎంత మంచి సినిమా అయినప్పటికీ జనాల వద్దకి ఇదొక సినిమా ఉంది అని తెలియకపోతే కనీస కలెక్షన్స్ గానీ గుర్తింపు గానీ లభించదు. సరిగ్గా ఈ సినిమాకి కూడా అలాగే జరిగింది. కన్నడ స్టార్ హీరోగా ‘రక్షిత్ శెట్టి‘ ఈ సినిమాతో తొలిసారి తెలుగు ఆడియెన్స్ ని పలకరించాడు. రక్షిత్ శెట్టి అనడం కన్నా రష్మిక మందన్న మాజీ ప్రియుడు అంటే తెలుగులో ఎక్కువ మంది గుర్తు పడతారు.
నిఖిల్ హీరోగా రూపొందిన ‘కిరాక్ పార్టీ’ ఒరిజినల్ వెర్షన్ ‘కిరిక్ పార్టీ’ లో ఈ హీరోనే నటించాడు. ఈ సినిమా తోనే రష్మిక కూడా సినిమాలకి పరిచయం అయింది. కన్నడ లో మంచి ప్రయోగాత్మక సినిమాలు, కొత్తదనం తో నిండిన సినిమాలు తీస్తాడు అని రక్షిత్ శెట్టి కి మంచి పేరుంది. కేవలం హీరోగానే కాకుండా రైటర్ గా, డైరెక్టర్ గా, లిరిసిస్ట్ గా కూడా రక్షిత్ కి టాలెంట్ ఉంది. ఈ హీరో ప్రస్తుతం ‘777 చార్లీ’ అనే కొత్త సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం మాత్రమే కాకుండా జూన్ 6 న టీజర్ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది సినిమా టీం. ఈ పోస్టర్స్ లో కేవలం రక్షిత్ మరియు కుక్క మాత్రమే కనిపిస్తూ ఎదో కొత్తదనం ఉండబోతుంది అని అనిపించేట్లు ఉంది. ఈ సినిమా ని పాన్ ఇండియా సినిమాగా కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.