శాండల్ వుడ్: కే.జి.ఎఫ్ కి ముందు కే.జి.ఎఫ్ తర్వాత అన్నట్టు మారింది కన్నడ సినీ ఇండస్ట్రీ పరిస్థితి. అంతకముందు అడపా దడపా మంచి సినిమాలు వచ్చినప్పటికీ కన్నడ ఇండస్ట్రీ ని పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇపుడు కన్నడ వాళ్ళు కూడా కంటెంట్ పరంగా పాన్ ఇండియా సినిమాలు రూపొందిస్తున్నారు. మధ్యలో కొన్ని పాన్ ఇండియా సినిమాలు అని విడుదల చేసినప్పటికీ కంటెంట్ లేకపోవడం తో వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియదు. నిఖిల్ నటించిన ‘కిరాక్ పార్టీ’ ఒరిజినల్ వెర్షన్ ‘కిరిక్ పార్టీ’ సినిమాలో హీరో గా నటించిన రక్షిత్ శెట్టి దర్శకత్వంలో ఒక సినిమా రానుంది. ఈ సినిమా టైటిల్ ప్రకటించడం తో పాటు చిన్న టీజర్ విడుదల చేశారు.
టీజర్ ఆరంభం లో ప్రరశురాముడు తన పవర్స్ వాడి సముద్రుడి దగ్గర భూమి లాక్కున్నాడు. అప్పటివరకు ఘాట్స్ అన్ని సముద్ర దేవుడి దగ్గరే ఉండేవి. తర్వాత సముద్ర దేవుడు తన భూమి కోసం పాశం విసరగా అందులో మూడు ప్రాణాలు పోయాయి. అందులో ఒక ప్రాణం తిరిగి రావచ్చు అని నరేషన్ ఇస్తుండగా ఒక కాకి ఒక సమాధి పై పొడుస్తుంటుంది. ఆ కాకిని వెళ్లగొడుతూ ఎవరైనా తిరిగి రావాలి కానీ వీడు రావద్దు అంటూ అంటుండగా వర్షం పడుతూ ఆ సమాధి పై ‘రిచర్డ్ ఆంథోనీ’ అని పేరు లాంచ్ అవుతుంది. ఆ వెంటనే కెమెరా సముద్రం వైపు రోల్ అవుతుండగా రిచర్డ్ ఆంథోనీ – లార్డ్ అఫ్ సి అనే టైటిల్ ప్రకటిస్తూ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు.
కే.జి.ఎఫ్ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు, ఈ సినిమాతో మరో సారి కే.జి.ఎఫ్ కి దీటుగా ఎలేవేషన్స్ తో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ రూపొందించనున్నట్టు హింట్స్ ఇచ్చారు. రక్షిత్ శెట్టి ఈ సినిమాలో హీరో గా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు. ‘అతనే శ్రీమన్నారాయణ’ సినిమా తో పాన్ ఇండియా లెవెల్ సినిమాలో కనిపించాడు రక్షిత్ శెట్టి. కంటెంట్ పరంగా బాగున్నప్పటికీ ఎందుకో అంతగా సక్సెస్ అవని రక్షిత్ శెట్టి ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అందుకోవాలని ఆశిద్దాం.