మూవీడెస్క్: రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఒకప్పుడు భారీ విజయాలు అందుకున్న ముద్దుగుమ్మ.
తెలుగు సినిమాలతో బిజీగా ఉండే రకుల్, కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరమయ్యారు. చివరగా 2021లో వచ్చిన కొండపొలం సినిమా తరువాత ఆమె నుంచి మరో తెలుగు సినిమా రాలేదు.
అయితే బాలీవుడ్, కోలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రకుల్, ఇప్పుడు తిరిగి సౌత్‌లో రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
2024లో రకుల్ నుంచి వచ్చిన భారతీయుడు 2, అయలాన్ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
వాయిదా పడిన కారణంగా ఈ సినిమాలు ఆశించిన రీతిలో సక్సెస్ అందించలేకపోయాయి. దీంతో ఆమె కెరీర్ మరింత సందిగ్ధంలో పడింది.
కానీ 2025లో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలపై రకుల్ భారీ ఆశలు పెట్టుకున్నారు.
అటు నార్త్‌లో దే దే ప్యార్ దే 2, మెరీ హస్బెండ్ కీ బీవీ, అమీరీ వంటి మూడు సినిమాల్లో నటిస్తున్న రకుల్, ప్రతి సినిమాలో తన పాత్ర కొత్తగా ఉంటుందని చెబుతున్నారు.
సౌత్‌లో ఆమె శంకర్ దర్శకత్వం వహిస్తున్న భారతీయుడు 3లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం.
కొత్త ఏడాదిలో కొత్త చిత్రాలతో రకుల్ తన మార్క్ చూపించబోతున్నారు. బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ తన క్రేజ్ మళ్లీ పెంచుకోవాలని చూస్తున్నారు.
ఇప్పుడు వచ్చే సినిమాలు ఆమెకు తిరుగులేని విజయాలు అందిస్తాయా? ఆమెకు కొత్త గుర్తింపు తీసుకురాగలవా? అనేది చూడాలి.