టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RC 16 షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాలను ఏర్పరిచింది. హైదరాబాద్‌లోని షెడ్యూల్ పూర్తి చేసిన చిత్రబృందం త్వరలో ఢిల్లీ, కాకినాడ లొకేషన్లలో షూటింగ్ జరపనుంది.
అయితే, ఇప్పుడు బాలీవుడ్ నుంచి మరో క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, రామ్ చరణ్‌తో ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల కరణ్ నిర్మించిన కిల్ మూవీ హిట్ కావడంతో, నగేష్ భట్‌ను దర్శకత్వ బాధ్యతలకు ఎంపిక చేసినట్లు టాక్.
ఇది నిజమైతే, రామ్ చరణ్ మరో పాన్-ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడన్న మాట. కరణ్ జోహార్ గతంలో విజయ్ దేవరకొండతో సినిమా ప్లాన్ చేసినా, అది సెట్ కాలేదు. ఇప్పుడు చరణ్‌తో సినిమా తీయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరింత ఆసక్తికరంగా, కరణ్ తెలుగు మార్కెట్‌పై దృష్టి సారించారని, చరణ్‌తో పాటు మరో రెండు, మూడు మిడ్-రేంజ్ సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.
ఈ వార్తలపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉన్నప్పటికీ, టాలీవుడ్, బాలీవుడ్ క్రాస్‌ఓవర్ ప్రాజెక్ట్‌పై సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.