మూవీడెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా గురించి వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా, చరణ్ ఈ చిత్రంలో మూడు పాత్రలు పోషిస్తున్నారని వస్తున్న వార్తలు ఫ్యాన్స్‌లో విపరీతమైన ఆసక్తిని రేపుతున్నాయి.
RRR తర్వాత చరణ్ చేస్తున్న పాన్-ఇండియా సినిమా కావడంతో అంచనాలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం, రామ్ చరణ్ ఈ సినిమాలో తండ్రి, కొడుకుగా రెండు ప్రధాన పాత్రల్లో మాత్రమే కనిపిస్తారని తెలుస్తోంది.
తండ్రి అప్పన్న పాత్ర ఒక రాజకీయ నాయకుడిగా ఉండబోతోంది. అతని పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని, కొడుకు రామ్ నందన్ పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయని సమాచారం.
మొదట కాలేజీ స్టూడెంట్‌గా, ఆ తర్వాత సివిల్ సర్వీస్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్‌గా మారిన కొత్త లుక్‌లో రామ్ చరణ్ కనిపించబోతున్నారు.
ఈ పాత్రల్లో వేరియేషన్స్ చాలా ఆసక్తికరంగా శంకర్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగా కనిపించబోతుండగా, రామ్ చరణ్ అవినీతి రాజకీయ నాయకుడిపై పోరాడే ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని సమాచారం.
మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, థమన్ సంగీతంలో ఉన్న పాటలు, చరణ్ స్టెప్పులు కూడా ప్రేక్షకులను అలరించనున్నాయి.
దిల్ రాజు ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు.