మూవీడెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న RC16 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
మైసూర్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న ఈ చిత్రం షూటింగ్ రీసెంట్‌గా ప్రారంభమైంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బుచ్చిబాబు ఈ సినిమాను యాక్షన్ లేదా పాటల సన్నివేశాలతో కాకుండా, కామెడీ సీక్వెన్స్‌తో మొదలుపెట్టారు.
మైసూర్ షెడ్యూల్‌లో రామ్ చరణ్‌తో పాటు జాన్వీ కపూర్, సత్య, చమ్మక్ చంద్ర, జాన్ విజయ్ పాల్గొంటున్నారు.
జాన్ విజయ్ సౌత్‌లో తన వినూత్నమైన కామెడీ మరియు విలన్ పాత్రలతో మంచి గుర్తింపు పొందిన నటుడు.
సత్య, చమ్మక్ చంద్రలాంటి హాస్యనటులు కూడా ఇందులో భాగమై ఉండటంతో ఈ షెడ్యూల్ పక్కా వినోదభరితంగా ఉంటుందని అర్థమవుతోంది.
ఇప్పటికే రామ్ చరణ్ తన ఓ ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో ‘RC16’ లో కామెడీ కొత్త తరహాలో ఉండబోతుందని తెలిపారు.
బుచ్చిబాబు కూడా మొదటి షెడ్యూల్‌ను కామెడీ సన్నివేశాలతో ప్రారంభించడం సినిమాపై ప్రేక్షకుల అంచనాలను పెంచింది.
ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది.
కథ నేటివిటీని మరింత ప్రభావవంతంగా చూపించడానికి ఉత్తరాంధ్ర ప్రాంత నటులను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. హైదరాబాద్‌లో విలేజ్ బ్యాక్‌డ్రాప్ కోసం ప్రత్యేకమైన సెట్ నిర్మించారు.
రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఉత్తరాంధ్ర స్లాంగ్‌ను కూడా నేర్చుకున్నారని సమాచారం.
మెగా అభిమానులు ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ‘గేమ్ చేంజర్’ కంటే ‘RC16’ పై క్రేజ్ ఎక్కువగా ఉంది.
ఈ చిత్రం వచ్చే ఏడాది చివరలో విడుదల కానుంది. దీని తర్వాత రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో ‘RC17’ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.
ఇదిలా ఉంటే ‘గేమ్ చేంజర్’ సంక్రాంతి 2025లో విడుదల కానుంది. నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నారు.